Bhadradri: భద్రాద్రిలో నేటి నుంచి నవమి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:29 AM
భద్రాచలంలో ఆదివారం వసంతపక్ష ప్రయుక్త నవహ్నిక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

భద్రాచలం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలో ఆదివారం వసంతపక్ష ప్రయుక్త నవహ్నిక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏప్రి ల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుఢాదివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న నవమి రోజున తిరుకల్యాణం, పునర్వసు దీక్ష ప్రారం భం కానుంది.
ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది. శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలకు గవర్నర్, సీఎంలను ఆహ్వానిస్తూ అధికారులు రాజ పత్రాలను అందించనున్నారు.