Home » Chandra Babu
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటీ జరగనుంది. 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
వైసీపీ అధినేత జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని.. ఈ విషయాన్ని జగన్ తెలుసుకోలేకపోయారన్నారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే వైసీపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. బీజేపీతో ఉంటే ఉన్నామని.. లేకపోతే లేమని జగన్ గట్టిగా చెప్పలేకపోయారన్నారు.
శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్ ని సస్పెండ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈయన గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు లంచం అడిగిన చరిత్ర ఈయనది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.
ఇవాళ మూడు శాఖల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్షించనున్నారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై చంద్రబాబు చర్చించనున్నారు.
బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందర డిమాండ్ పెట్టారని.. కానీ ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు కనీసం నోరు కూడా మెదపడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదన్నారు. మోదీ సర్కార్ లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు..హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు.
మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గెలుపుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గెలుపుపై తొలిసారి చంద్రబాబు స్పందించారు. గత ఎన్నికల్లో లోకేష్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారన్నారు. ప్రజలందరి అభిమానం చూరగొని లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచారన్నారు.
తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. వరలక్ష్మీ నగర్, నాగార్జున నగర్, పోలీస్ కాలనీల్లో పేదలకు స్వయంగా గద్దె రామ్మోహన్ పెన్షన్ అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పెన్షన్ తొలగించారని ఎమ్మెల్యేకు పలువురు వృద్దులు తెలిపారు. ఆగస్ట్‌లో అర్హత ఉన్న వారికి పెన్షన్ లు మంజూరు చేసేలా చూస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు.
ఒకటో తారీఖు వచ్చేసింది. పెన్షన్ వస్తుందా? లేదంటే లేటవుతుందా? అనే చింత లేకుండా తెల్లవారేపాటికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు.
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రా జెక్టును ఆదివారం విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుం ది. ఈ బృంద సభ్యులు ఉదయం 9.45గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు.