Home » Cheater
రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి.. ఓ కిలేడీ భారీగా డబ్బులు కాజేసింది. తన మాటలతో అమాయకుల్ని బుట్టలో పడేసి.. ఏకంగా కోటిన్నర దోచుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని గుడివాడలో చోటు చేసుకుంది.
ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను మోసగిస్తోందని, విద్యావంతులైన పట్టభద్రులు కూడా వీటికి మోసపోతారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. సమాజానికి దిక్సూచిగా ఉంటూ దిశానిర్దేశం చేసేది పట్టభద్రులేనన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఓటేయాలని కోరారు.
ఈడీ(ED) అడిషనల్ డైరెక్టర్స్ అంటూ ఇద్దరు కేటుగాళ్లు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన ఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. ధెంకెనాల్ జిల్లాకు చెందిన తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది.
హైదరాబాద్: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే కేటు గాళ్ళు టోకరా వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేశారు.
వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.
స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(Dhoni) కూడా కోట్ల రూపాయలు మోసపోయారు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఇద్దరు రూ.15 కోట్ల మేర తనను మోసం చేశారని ధోనీ ఏకంగా కోర్టులో కేసు వేశారు.