Share News

Araku Coffee in Parliament: పార్లమెంటులో అరకు కాఫీ

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:05 AM

పార్లమెంటులో అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభించడం గర్వకారణమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అరకు కాఫీ గిరిజన రైతుల శ్రమకు దక్కిన గౌరవం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

Araku Coffee in Parliament: పార్లమెంటులో అరకు కాఫీ

స్పీకర్‌ అనుమతితో రెండు స్టాల్స్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): గిరిజన సంపద అరకు కాఫీని ప్రమోట్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సహకార సంస్థ పార్లమెంటులో కాఫీ స్టాళ్లను ప్రారంభించడం గర్వంగా ఉందని కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. కాఫీ స్టాళ్ల ఏర్పాటు.. బ్రాండ్‌ భారత్‌కు బిగ్‌ బూస్ట్‌ అని ఎక్స్‌ వేదికగా కితాబిచ్చారు. సోమవారం, పార్లమెంటులో రెండు అరకు కాఫీ స్టాళన్లు ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రారంభించారు. లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్‌ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జోయల్‌ ఓరం, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీభరత్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి, దగ్గుమళ్ల ప్రసాదరావు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌, జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్‌ ఓం బిర్లాకు అరకు కాఫీ పొడిని సంధ్యారాణి అందజేశారు.


రాష్ర్టానికే గర్వకారణం: రామ్మోహన్‌నాయుడు

పార్లమెంట్‌ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటు రాష్రానికే గర్వకారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ‘1.5 లక్షల గిరిజన రైతుల శ్రమకు దక్కిన ఫలితం. ఎన్నో ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న గిరిజన రైతుల కృషి నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపింది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో అరకు కాఫీ లాంటి జీఐ ఉత్పత్తులు గుర్తింపు పొందుతున్నాయి’ అని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:09 AM