Share News

Cheating: పెళ్లి తనతో.. పిల్లలు మరొకరితో.. అది తెలిసిన భర్త ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jan 10 , 2024 | 04:34 PM

వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.

Cheating: పెళ్లి తనతో.. పిల్లలు మరొకరితో.. అది తెలిసిన భర్త ఏం చేశాడంటే..
Wife Cheats Husband

బీజింగ్, జనవరి 10: వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది. ఇష్టపడి కట్టుకున్న భార్య 16 ఏళ్లుగా భర్తను మోసం చేయడమే కాకుండా.. ప్రియుడితోనే పిల్లలను కనింది. నలుగురు పిల్లల తండ్రి తాను కాదని తెలుసుకుని షాక్ అయిన భర్త.. తన భార్యతో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.

చైనాకు చెందిన చెన్, యు భార్యభర్తలు. వీరికి పెళ్లి అయి 16 ఏళ్లు అవుతుంది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, చెన్‌ ఇటీవల షాకింగ్ విషయం తెలుసుకున్నాడు. తనకున్న నలుగురు పిల్లలకు తాను అసలైన తండ్రి కాదని గుర్తించి అవాక్కయ్యాడు. 16 ఏళ్లుగా కట్టుకున్న భార్యే తనను మోసం చేసిందని గుర్తించి విడాకులు కోరాడు. పెళ్లయినప్పటి నుంచి తనను మోసం చేస్తూనే ఉందని గుర్తించాడు చెన్. నలుగురు పిల్లల్లో ఎవరికీ తన డీఎన్‌ఏ మ్యాచ్ అవకపోవడం హతాశుడయ్యాడు.

అంతేకాదు.. తన వ్యక్తిగత న్యాయవాది 'వు' అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని చెన్ చెప్పుకొచ్చాడు. తమకు మొదటి కుమార్తె జన్మించినప్పుడు.. చూసేందుకు అతనే ముందుగా వచ్చాడని, 2008, 2010, 2018లో జన్మించిన మరో ముగ్గురు అమ్మాయిలకు తండ్రి కూడా 'వు' అని గుర్తించినట్లు చెప్పాడు చెన్. ఈ వ్యవహారంపై విచారణాధికారులకు ఫిర్యాదు చేశాడు చెన్. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా.. పుట్టిన నలుగురు కూతుళ్లు కూడా తన పిల్లు కాదని నిర్ధారించుకుని షాక్ అయ్యాడు. యు పై కంప్లైంట్ ఇచ్చిన చెన్.. తనకు సంబంధం లేని పిలల కోసం చేసిన ఖర్చులన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారింది. చైనా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందా? అని ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Jan 10 , 2024 | 10:07 PM