అరుంధతికి వార్షిక కాంట్రాక్ట్
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:11 AM
భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ సోమవారం వెల్లడించింది. మూడు గ్రూపుల్లో మొత్తంగా 16 మందికి చోటు దక్కగా, ఆరుగురిపై వేటు పడింది...

‘ఎ’లోనే హర్మన్, మంధాన, దీప్తి
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ సోమవారం వెల్లడించింది. మూడు గ్రూపుల్లో మొత్తంగా 16 మందికి చోటు దక్కగా, ఆరుగురిపై వేటు పడింది. కొత్తగా ఐదుగురికి అవకాశం కల్పించారు. 2022-23 తర్వాత బోర్డు వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించడం మళ్లీ ఇప్పుడే. వీరిలో గ్రేడ్ ఎ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు కాకుండా రూ. 50 లక్షలు, బి గ్రేడ్ వారికి రూ. 30 లక్షలు, సి గ్రేడ్‌కు రూ 10 లక్షలు లభిస్తాయి. ఇందులో తెలుగు పేసర్ అరుంధతి రెడ్డికి గ్రేడ్ ‘సి’లో చోటు దక్కింది. మరోవైపు గ్రేడ్ ‘ఎ’లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ స్థానాల్లో మార్పు లేదు. గ్రేడ్ ‘బి’లో రాజేశ్వరి గైక్వాడ్ చోటు కోల్పోగా.. రేణుకా సింగ్, జెమీమా, షఫాలీ, రిచా ఘోష్ కొనసాగుతున్నారు. ఇక గ్రేడ్ ‘సి’లో అరుంధతి, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారి అవకాశం ఇవ్వగా.. యాస్తిక భాటియా, రాధా యాదవ్, పూజా వస్ర్తాకర్, స్నేహ్ రాణా తమ చోటును కాపాడుకున్నారు. అయితే ఈ గ్రేడ్ నుంచి ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, దేవికా వైద్య, అంజలి శర్వాణి, మేఘనా సింగ్‌లకు ఉద్వాసన పలికారు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..