CM Revanth Reddy: కేసీఆర్ శాసనసభ్యత్వం రద్దుపై దృష్టి పెడతాం
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:15 AM
మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ్యత్వం రద్దు చేసేందుకు న్యాయపరంగా దృష్టి పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని చెప్పారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం
గజ్వేల్ కాంగ్రెస్ నేతలతో సీఎం
కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలి
సిద్దిపేట నుంచి రాజ్‌భవన్‌కు పాదయాత్రగా నేతలు
రేవంత్‌తో పాటు గవర్నర్‌కు వినతిపత్రాల అందజేత
గజ్వేల్/హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ శాసనసభ్యత్వం రద్దు చేసేందుకు న్యాయపరంగా దృష్టి పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్ వరకు పోరుబాట పాదయాత్ర చేపట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి చేరుకుని వారు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం.. నెల రోజుల్లో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని, వారిని అన్ని రకాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. గజ్వేల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులను మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డి ఆరోగ్యం బాగా లేనప్పటికీ పాదయాత్ర చేపట్టడం పట్ల కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందన్నారు. అంతకుముందు సిద్దిపేట కలెక్టర్‌కు కూడా గజ్వేల్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. సీఎంను కలిసిన అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News