షట్లర్ సుమిత్ రిటైర్
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:08 AM
బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడా కారుడు బి. సుమిత్ రెడ్డి ఆటకు వీడ్కోలు పలికాడు. ఇకనుంచి పూర్తిగా కోచింగ్‌పైనే దృష్టి సారించాలనుకుంటున్నానని హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల సుమిత్...

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడా కారుడు బి. సుమిత్ రెడ్డి ఆటకు వీడ్కోలు పలికాడు. ఇకనుంచి పూర్తిగా కోచింగ్‌పైనే దృష్టి సారించాలనుకుంటున్నానని హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల సుమిత్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. 2022 కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ రజత పతక విజేత అయిన సుమిత్.. డబుల్స్ షట్లర్ సిక్కిరెడ్డి భర్త. సిక్కితో పాటు అశ్వినీ పొన్నప్పలాంటి స్టార్ షట్లర్లతో కలిసి ఎన్నో మిక్స్‌డ్ మ్యాచ్‌లు ఆడిన సుమిత్.. పురుషుల డబుల్స్‌లో మను అత్రి జతగా అంతర్జాతీయస్థాయిలో రాణించాడు. 2015లో మెక్సికో సిటీ గ్రాండ్ ప్రీ, 2016లో కెనడా ఓపెన్ డబుల్స్ టైటిళ్లు నెగ్గిన సుమిత్.. 2015లో యూఎస్, డచ్ ఓపెన్ టోర్నీల్లో రన్నర్‌పగా నిలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న సుమిత్.. కెరీర్‌లో అత్యుత్తమంగా 17వ ర్యాంక్ అందుకున్నాడు. 2021లో భార్య సిక్కిరెడ్డితో కలిసి హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసిన సుమిత్.. చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..