Home » Chennai News
జీబీఎస్ అనే కొత్త వైరస్(New virus) బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
రాష్ట్ర పోలీసు ఉద్యోగాల ఎంపికలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావటంతో తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మహిళా ఐపీఎస్ అధికారి కల్పనా నాయక్(Woman IPS officer Kalpana Naik) డీజీపీ శంకర్‌జివాల్‌కు రాసిన లేఖ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
నిషేధిత తాబేళ్లు తరలిస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్(Bangkok) నుంచి శ్రీలంక మార్గంగా మదురై(Madhurai) వచ్చిన శ్రీలంకన్ విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
తిరువళ్లూర్, తిరువణ్ణామలై, కృష్ణగిరి, విల్లుపురం సహా 9 జిల్లాల కలెక్టర్లు(Collectors), ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.
చెన్నై మెట్రోరైల్వే సంస్థ నగరంలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండో దశ మెట్రోరైలు మార్గాల ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఒకే స్తంభంపై ఐదు డబుల్ లేయర్డ్ ట్రాక్‌లను నిర్మించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపడుతున్న ఘనత తమ సంస్థకే దక్కుతుందని సీఎంఆర్ఎల్ డైరెక్టర్ అర్జునన్ తెలిపారు.
చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా వెంగపాక్కం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 1,330 మంది విద్యార్థులు తిరువళ్లువర్(Thiruvalluvar) ఆకారంలో నిలబడి ‘ఇస్టన్’ ప్రపంచ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు.
స్థానిక ట్రిప్లికేన్ నియోజకవర్గం(Triplicane Constituency)లో ఓ బాక్సర్‌ను వెంటాడి బుధవారం అర్ధరాత్రి దారుణంగా హతమార్చిన కిరాయి ముఠాకు చెం దిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
స్థానిక క్రోంపేటలోని రేలా ఆస్పత్రిలో విద్యుదాఘాతానికి గురై కుడి భుజం ఎముక కదలకుండా అస్వస్థతకు గురైన రాజప్రకాశం అనే వృద్ధుడికి బెలూన్ ఇంప్లాంటేషన్ తరహా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియమూర్తి తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల కోసం కాకుండా వాస్తవంగానే తమిళ ప్రజలను, తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రేమిస్తున్నారని, జాతీయవాదం పెరుగుతున్నందున తమిళ ప్రజలు మోదీని ఆదరిస్తారనే నమ్మకం తనకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
‘పర్వత రాణి’గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్(Kodaikanal)లో ‘చెర్రీ’ పుష్పం వికసించింది. ఏడాదికొకమారు పూసే ఈ పుష్పాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. కొడైకెనాల్లో ప్రపంచంలోని అరుదైన పుష్పాలెన్నో వుంటాయి.