Home » children
కొందరు చిన్న పిల్లలు తోటి వయసు వారికి భిన్నంగా ప్రవర్తింటారు. మరికొందరు పిల్లలు వివిధ రకాల సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి..
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, సంబంధిత స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.
ఢిల్లీలోని ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 20 రోజుల వ్యవధిలో 14 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేకెత్తిస్తోంది. వారి మరణాలకు కారణాలేంటన్నది ఇంకా తెలియక పోవడం గమనార్హం.
ఆటపాటలతో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయస్సులో పనిముట్లు పట్టుకుంటూ సంతోషాలకు దూరం అవుతున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, ఇటుక బట్టీల్లో పని చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి వారిని రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టింది. అలాగే బాల్య వివాహాలు నిర్మూలించేందుకు సైతం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో బాధిత చిన్నారులను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ప్రపంచంలో అత్యధిక శాతం బడి పిల్లలకు కనీస వ్యాయామ విద్య అందుబాటులో లేదని యునెస్కో పేర్కొంది
మంచిగా మాట్లాడి సర్వజనాస్పత్రి నుంచి ఓ పాపను ఎత్తుకెళ్లిన ఆమని అనే మహిళ పోలీసులకు చిక్కింది. తన స్నేహితు రాలి కుమార్తె జిల్లా కేంద్రంలోని ప్రభుత సర్వజన ఆస్పత్రిలో కాన్పు కావడంతో ఆమెను చూడటానికి బాలింత తల్లితో పాటు వచ్చింది. రాత్రికి అక్కడే బాలింతకు తోడుగా పడుకుంది. స్నేహితురాలి కుమార్తెకు ఆరాత్రి ఎన్నో నీతులు చెప్పింది. చివరకు తెల్లవారుజామున పక్కన ఉన్న మరో బాలింత బిడ్డను ...
ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వీధి కుక్కల బారి నుంచి రక్షించండంటూ హైదరాబాద్‌కు చెందిన పలువురు చిన్నారులు రోడ్డెక్కారు. రేవంత్ అంకుల్ (సీఎం రేవంత్ రెడ్డి) మమ్మల్ని కాపాడండి..
దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.