Home » China
భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడబోమని ఆయన వ్యాఖ్యానించారు.
గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నాలుగేళ్ల పాటు సరిహద్దులో కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే ముగింపుపడిన విషయం తెలిసిందే. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం కుదుర్చుకున్నాయి.
ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.
తూర్పు లడఖ్లోని డెప్సాంగ్, డెమ్చోక్లో ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. ఈ విషయాన్ని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. సాధారణ పెట్రోలింగ్ త్వరలో పున: ప్రారంభమవుతుందని సైనిక అధికారులు..
విమానాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఓ యువతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడానికి ఆమె వేసిన ప్లాన్ చూసిన అధికారులు కంగుతిన్నారు.
చైనాతో చర్చల్లో పురోగతికి సైన్యం, దౌత్య బృందాల కృషి కారణమని జైశంకర్ అన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా దెప్సాంగ్, దమ్చోక్లో బలగాల ఉపసంహరణ మొదలైందన్నారు. త్వరలోనే ఆ ప్రకియ పూర్తవుతుందని చెప్పారు.
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. 2019 తర్వాత ఇరుదేశాధినేతల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సమావేశం కావడం గమనార్హం. ఇద్దరూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అనేవి చాలా తీవ్రమైన సమస్యలు. వీటిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలనిని మోదీ సూచించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్కు చైనా ఆర్థిక సహాయాన్ని ఎండగట్టారు.
గాల్వన్ లోయలో ఉద్రిక్తతలు ఏర్పడటానికి(2020 మే) ముందు సరిహద్దులో భారత్, చైనా సైన్యం ఏ విధంగానైతే గస్తీ నిర్వహించేవారో తిరిగి అదే విధంగా గస్తీ నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడిందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు.
భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, దీనిపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది.