Flying Taxis in China: చైనాలో ఎగిరే ట్యాక్సీలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:34 AM
చైనాలో ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రెండు సంస్థలకు ఎయిర్ ట్యాక్సీలను వాణిజ్య ప్రయాణాలకు అనుమతించింది. పైలెట్ అవసరం లేకుండా డ్రోన్ సాయంతో గాల్లో ప్రయాణించే ఈ ట్యాక్సీలు రోడ్డు మార్గంలో పోకడలు ఉండే ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి

వాణిజ్యపరంగా వినియోగించేందుకు
రెండు సంస్థలకు ప్రభుత్వం అనుమతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆ ట్యాక్సీలు దూసుకెళ్లేది రోడ్డు మీద కాదు.. రెక్కలు తొడుక్కొని.. రివ్వున గాల్లోకి ఎగిసి.. ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతూ గమ్యస్థానాలకు చేరవేస్తాయి! మన దేశంలో ఇంకాస్త సమయం పడుతుందేమో గానీ చైనాలో అధికారికంగా ఈ ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయి. వీటికి పైలెట్ అవసరమే లేదు. డ్రోన్ సాయంతో గాల్లో ప్రయాణిస్తాయి. ఈ ఎయిర్ ట్యాక్సీలను కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసుల కోసం వినియోగించుకునేందుకు ఈ హ్యాంగ్, హెఫెయీ అనే రెండు ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఈ రెండు కంపెనీలకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ జారీ చేసింది. రోడ్డు మార్గం సరిగా లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ ఎయిర్ ట్యాక్సీలు ఎంతో అనుకూలం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
Viral Video: నువ్వు నిజంగా హీరోవి బాసు.. కత్తికి కూడా భయపడలేదు..