Share News

Supreme Court: పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:25 AM

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతంది. పోస్టల్ బ్యాలెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Supreme Court: పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోస్టల్ బ్యాలెట్‌పై (Postal Ballot) సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్ (Justice Arvind Kumar), జస్టిస్ సందీప్ మెహతా (Justice Sandeep Mehta) నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటికే టీడీపీ ఏమ్మెల్యే వెలగపూడి (TDP MLA Velagapuei) సుప్రీం కోర్టులో కేవియట్ (Caveat) దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి ఏపీ హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసింది.


అయితే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్‌లో పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అవసరమైతే ఎన్నికల కౌంటింగ్ తరువాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేది లేదని డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది.


కాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వైసీపీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది


వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?

పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్‌పై వేసిన అప్పీల్‌లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా.. నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యధాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. హైకోర్టులో వారి వాదనలను వైసీపీ వెనక్కి తీసుకుందని అశోక్ బాబు తెలిపారు.


‘‘పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీ ఏవో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధం. సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీవారు ఉక్రోషంతో ఇటువంటి లిటికేషన్స్ తయారు చేస్తున్నారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.4 వ తేది తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయం’’ అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..

ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 03 , 2024 | 10:28 AM