Home » CM KCR
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు( CM KCR ) సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును గురువారం నాడు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దంపతులు హెలికాప్టర్‌లో రేపు చింతమడకకు రానున్నారు.
బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ని నిర్వహించడం జరిగింది.
Telangana Elections: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు కానీ.. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి గంజ్, జేపీఎన్ రోడ్‌లోని ఇస్లాంపురలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం దుబ్బాకకు వచ్చి నన్ను తిట్టారు. కట్టిన ఇళ్లు పాడైపోతున్నాయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిచ్చినందుకా?, దుబ్బాక మీద కేసీఆర్‌కు (Cm kcr) ప్రేమ ఉంటే
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేఎంసీ గ్రౌడ్స్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. 1969 ఉద్యమంలో 400 మందిని చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని విమర్శించారు. ఆరోజు ఆజంజాహి మిల్లును కాంగ్రెస్ అమ్ముకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాక కాకతీయ మెగా టెక్స్ట్‌టైల్స్ పార్క్ నిర్మిస్తున్నామని తెలిపారు.
Telangana Elections: దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఆ భూమి ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నారని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు.
Telangana Elections: చేర్యాల పట్టణంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మద్దతుగా తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జా దారుడని ఆరోపించారు.
Assembly Elections : టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యత్నిస్తున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు ఒప్పు కోలేదని.. కేసీఅర్ ఓటమి తెలిసే చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామన్నారు. ఇప్పుడేమో బాబు మద్దతు కోసం చూస్తున్నానని సీపీఐ నారాయణ తెలిపారు.
అంబర్‌పేట ప్రజలు తమ రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అంబర్‌పేటకు త్వరలో మెట్రో రైలు తీసుకు వస్తామని రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అంటూ సీఎం కేసీఆర్ ( CM KCR ) , బీఆర్ఎస్ నేతలు పేపర్ ప్రకటనలు చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని నర్సారెడ్డి చెప్పారు.