CM KCR: ఆ ఘనత కాంగ్రెస్‌కే దక్కింది.. సీఎం కేసీఆర్ ఫైర్
ABN , First Publish Date - 2023-11-28T14:32:37+05:30 IST
Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేఎంసీ గ్రౌడ్స్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. 1969 ఉద్యమంలో 400 మందిని చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని విమర్శించారు. ఆరోజు ఆజంజాహి మిల్లును కాంగ్రెస్ అమ్ముకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాక కాకతీయ మెగా టెక్స్ట్‌టైల్స్ పార్క్ నిర్మిస్తున్నామని తెలిపారు.
వరంగల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కేఎంసీ గ్రౌడ్స్‌లో నిర్వహించిన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. 1969 ఉద్యమంలో 400 మందిని చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని విమర్శించారు. ఆరోజు ఆజంజాహి మిల్లును కాంగ్రెస్ అమ్ముకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చాక కాకతీయ మెగా టెక్స్ట్‌టైల్స్ పార్క్ నిర్మిస్తున్నామని తెలిపారు. లక్షన్నర ఉద్యోగాలు వరంగల్ జిల్లాలో కల్పించబోతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాకే రోడ్లన్నీ విస్తరించుకున్నామని చెప్పారు. 24 అంతస్తులతో అత్యంత అత్యాధునిక రంగులతో ఆస్పత్రి నిర్మించుకున్నామని చెప్పారు. తూర్పు, పశ్చిమ అభ్యర్థులు బీసీ బిడ్డలే అని.. వారిని కచ్చితంగా గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి