Home » CM Revanth Reddy
వరంగల్ సభా వేదికగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతలు ఎ.జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వేర్వేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను ఓడిస్తానని ఆనాడు చెప్పి మరీ ఓడించానని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మరీ గుండు
తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.
నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు సక్సెస్ ఫుల్గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని, పది నెలల రేవంత్ పాలనలో అందరి కడుపు కొట్టారని హరీష్రావు ధ్వజమెత్తారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(Kutubullapur MLA KP Vivekanand) పీఏ బండ మల్లేష్ పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన్నే దామోదర్ ఈనెల 16వతేదీన జీడిమెట్ల(Jeedimetla) పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదుచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు వరంగల్ ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డకౌట్ అయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహించిన క్రికెట్ ట్రోఫిలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.