Home » CM Revanth Reddy
‘మూసీ’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు డబ్బులు కావాలని, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని పేదల వాణి విని.. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ సత్ఫలితాలను ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారే ‘ప్రధాని, అదానీ’ అని చెప్పారు.
వాంతులు, విరేచనాలతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించిన ఇద్దరు విద్యార్థులకు చికిత్స చేసేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. కారణం.. ఆస్పత్రిలో పన్నెండేళ్ల లోపు పిల్లలకే వైద్యం చేస్తామని, బాధిత విద్యార్థుల వయసు 13 ఏళ్లు అని.. నిబంధనల ప్రకారం వారికి నిలోఫర్‌లో చికిత్స చేయడం కుదరదని తేల్చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజల పాలిట రాబందులా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోదిస్తున్నారని, ఆక్రోశిస్తున్నారని తెలిపారు.
‘‘మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నడుస్తున్నారు. హుస్సేన్‌సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఏమీ చేయకుండానే ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.
మూసీ పరీవాహక బస్తీల్లో ఒక రోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రకటించారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం ఆశించిన మేర రావడం లేదు. ఏప్రిల్-అక్టోబరు మధ్య మూడు నెలల్లో రాబడి తగ్గింది. దీంతో అదనపు ఆదాయ వనరులపై దృష్టిసారించాలని సీఎం రేవంత్, ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి పలుసార్లు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
మూసీ బాధితుల ఇంట్లోనే రేపు ఉంటాం, అక్కడే పడుకుంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ బాధితుల సమస్యలను పరిష్కరించేలా రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.