KTR: బీజేపీ రేవంత్ మధ్య రహస్య బంధం ఇదే.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:41 PM
KTR: రేవంత్, బీజేపీ మధ్య రహస్య బంధం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను మోదీ ప్రభుత్వం కాపాడుతోందని కేటీఆర్ ఆరోపించారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతుందే బీజేపీ నాయకత్వమని ఆరోపించారు. దేశంలో అత్యంత పవర్ ఫుల్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని తెలిపారు. ఇవాళ(మంగళవారం) బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడిగా బలపర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని చెప్పారు. రాజకీయ బాంబులు పేలకపోవటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయ్యారని విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని బీజేఎల్పీ లీడర్ మహేశ్వరరెడ్డి కూడా అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.
రేవంత్‌పై చర్యలేవీ...
రేవంత్, రాహుల్ (ఆర్ఆర్) టాక్స్ అని స్వయంగా ప్రధాని మోదీ అన్నారని... కానీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కోసం తామెందుకు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని అన్నారు. హైదరాబాద్ పరిధిలో పోటీకి తమకు సరిపడా నంబర్ లేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీపై తమ విధానం తమకు ఉంటుందని అన్నారు. ఎల్పీజీ ధర పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అంత ఉలికిపాటు ఎందుకని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
కేంద్రం భూముల అమ్మకం ఆపలేదా ...
రేవంర్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే హెచ్‌సీయూ భూముల అమ్మకం ఆపలేదా అని నిలదీశారు. జాతీయ పార్టీలను నమ్ముకుంటే తెలంగాణ మునిగినట్లేనని విమర్శించారు. వరంగల్ సభ ద్వారా ఇదే సందేశాన్ని కేసీఆర్ ప్రజలకు ఇవ్వబోతున్నారని తెలిపారు. హాస్టల్స్, గురుకులాల్లో సన్న బియ్యం ప్రవేశపెట్టిందే కేసీఆర్ అని చెప్పారు. సన్న బియ్యం కాన్సెప్ట్ కొత్తదేమీ కాదని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు పెడితే.. కాంగ్రెస్‌కు ఉన్న ఆదరణ ఏంటో తెలుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆదిత్యనాథ్ దాస్ నియామకం ఎలా...
నీటి కేటాయింపుల విషయంలో ఏపీ తరుపున వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ అడ్వజైర్‌గా నియమించడం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినందున.. ఆదిత్యానాథ్ దాస్‌ను పెట్టుకున్నారేమోనని విమర్శించారు.
నీటి సమస్యల పరిష్కారంలో విఫలం..
తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించటం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడిగా జలదోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు కేసీఆర్‌పై ఉన్న ద్వేషంతో రైతులను ఎండ గడుతున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ ఎప్పుడు కొట్టుకుపోతుందా అని.. కాంగ్రెస్ గుంట నక్కలా ఎదురుచూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
1200 ఎకరాల్లో వరంగల్ సభ...
1200ఎకరాల్లో వరంగల్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ 25వ ఏడాదిలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ ఏడాది మొత్తం బీఆర్ఎస్ నేతలకు సంబురాలే అని చెప్పారు. వరంగల్ సభ పర్మిషన్ కోసం వరంగల్ ఏసీపీని ఆడిగామని... తెలంగాణ డీజీపీతో నిన్న మాట్లాడానని తెలిపారు. మూడు వేల బస్సుల కోసం ఆర్టీసీని ఆడిగామని చెప్పారు. ఆదివారం సభ కాబట్టి ఎవరికి ఏలాంటి ఇబ్బంది ఉండదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ దిశానిర్దేశం..
అన్ని జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి దిశానిర్దేశం చేశారని అన్నారు. తమ పార్టీ చరిత్రలో వరంగల్‌ది అతి పెద్ద సమావేశం అవుతుందని తెలిపారు. మే నెలలో డిజిటల్ మెంబెర్ షిప్ ప్రారంభిస్తామని ప్రకటించారు. 2025 అక్టోబర్‌లో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని అన్నారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు పార్టీ మెంబెర్ షిప్, కమిటీలపై దృష్టి పెడతామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జూన్ జూలైలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఘనంగా బన్నీ పుట్టినరోజు వేడుకలు
Kishan Reddy: మోదీ ప్రభుత్వంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం
Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..
Read Latest Telangana News And Telugu News