Home » Congress
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చారని, ధరణి పీడకలగా మారిందని, అందుకే, రైతుల సమస్యలు పరిష్కరించే చుట్టంలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబంలో తాను సభ్యుడిని కావడం వల్లే ప్రతిసారి తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని వాద్రా ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తన పేరు ఆ పార్టీలకు గుర్తు వస్తుందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిందన్నారు.
ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.
Telangana SC Reservation: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కూలదొచ్చే కుట్రలో భాగంగా ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు మహా కూటమి పార్టీల భేటీ ఈ నెల 17న జరగనుంది. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషణ
కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది
గుజరాత్లో పరాజయాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, 41 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులను నియమించింది. పార్టీ గాడిలో పెట్టేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’ ప్రారంభించింది.
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.