Bail Petition: సజ్జల భార్గవ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:06 AM
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టుల కేసులో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డిల ముందస్తు బెయిల్‌పై హైకోర్టు వాదనలు పూర్తి చేసింది. న్యాయమూర్తి ఎన్.విజయ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు

మరికొందరి పిటిషన్లపైనా ముగిసిన వాదనలు
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి, సింగిరెడ్డి అర్జున్‌రెడ్డి, మరికొందరు వైసీపీ సానుభూతిపరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా వైసీపీ కార్యకర్తలను, సానుభూతిపరులను ప్రోత్సహించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో తమపై నమోదైన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్‌రెడ్డి, సింగిరెడ్డి అర్జున్‌రెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.