Sensational Verdict: బాలిక హత్య కేసు.. కోర్టు సంచలన తీర్పు..
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:24 PM
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.

అనకాపల్లి జిల్లా: పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో (Telugu Statges) సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసు (Murder Case)లో బుధవారం న్యాయంస్థానం (Court) సంచలన తీర్పు (Sensational Verdict) వెలువరించింది. ఈ కేసులో నిందితుడు శేఖర్‌ను దోషిగా చోడవరం న్యాయమూర్తి ప్రకటించి.. మరణశిక్ష (Death Penalty)ను ఖరారు చేశారు. చోడవరం కోర్టు చరిత్రలో మొదటి సారి ముద్దాయికి ఉరిశిక్ష విధించింది. దేవరాపల్లికి చెందిన శేఖర్(31)కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మరణ శిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
Also Read..: Bandi Sanjay: ఆ భూములను వేలం వేయడం కుదరదు..
శేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు స్కూల్‌కి వెళ్లి వస్తున్న బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా విచారణ జరిగి ఈ రోజు న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగిందని అంతా భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీపీసీసీ చీఫ్ కరాటేలో బ్లాక్ బెల్ట్..
హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ..
KTR: హెచ్‌సియూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏమిటి..
For More AP News and Telugu News