Home » CS Jawahar Reddy
అమరావతి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరే వేరు.
అధికార వైసీపీ మరో వంకర ఎత్తుగడకు తెర లేపింది. ‘సుమోటో కుల ధ్రువీకరణ, పరిశీలన’ పేరిట రెవెన్యూ సిబ్బందిని జనంలోకి పంపించాలనే ఆలోచన చేసిన సర్కారు...
పింఛన్ల పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. సోమవారం నాడు కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీపై రివైజ్డ్ మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు.
ఏపీపీఎస్సీ గ్రూపు-1స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష రేపు (ఆదివారం) జరగనున్నదని సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) అన్నారు. పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు.
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. ఎన్నికల సమయంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు అవసరమవుతాయని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జనవహర్ రెడ్డి పాల్గొన్నారు.