Share News

Stock Market: Today ఇవాళ మార్కెట్ ఎటువైపు.. పైకా, కిందికా

ABN , Publish Date - Apr 01 , 2025 | 07:42 AM

రేపు ఏప్రిల్ 2 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై ప్రకటన రిలీజ్ చేయనున్న తరుణంలో ఇవాళ మార్కెట్ మూమెంట్ పైకా, కిందికా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

Stock Market: Today ఇవాళ మార్కెట్ ఎటువైపు..  పైకా, కిందికా
stock market

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఇవాళ ఏప్రిల్ 1న భారత స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోందన్న ఉత్సుకత మార్కెట్ వర్గాల్లో చాలానే ఉంది. రేపు ఏప్రిల్ 2 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై ప్రకటన రిలీజ్ చేయనున్న తరుణంలో ఇవాళ మార్కెట్ మూమెంట్ పైకా, కిందికా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే, ట్రంప్ టారిఫ్ బెదిరింపులు ఇండియాపై పెద్దగా ప్రభావం చూపించవని మార్కెట్ పండితులు చెబుతున్నారు. భారత్ మీద అధిక టారిఫ్ విధిస్తే అది అగ్రరాజ్యానికీ ఇబ్బంది కరమేనని అంటున్నారు.


ఇక, నేడు (ఏప్రిల్ 1)కి ట్రేడ్ సెటప్ విషయానికొస్తే, NSE నిఫ్టీ 50 ఇండెక్స్ 23,800 – 23,810 మధ్య ప్రతిఘటన(Resistance) ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ 23,810 కంటే పైకి స్ట్రాంగ్ గా వెళుతుంటే 24,000 – 24,080 టచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒక వేళ నిఫ్టీ 50 ఇండెక్స్ 23,400 కంటే తక్కువగా ఉంటే, బేరిష్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఫలితంగా 23,200–23,000 వరకూ దిగిరావొచ్చని చెబుతున్నారు.


ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే, రెసిస్టెన్స్ 51,850 - 52,000 వద్ద ఉండొచ్చని, 52,000 కంటే స్ట్రాంగ్ బ్రేక్ అవుట్ ఉంటే మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ 'ఇండెక్స్ 200-DSMA' సపోర్ట్ 51,000 కంటే ఎక్కువగా ఉన్నంత వరకు ట్రేడర్లు బ్యాంక్ నిఫ్టీకి 'బై ఆన్ డిప్స్' వ్యూహాన్ని కొనసాగిస్తే బెటర్ అంటున్నారు.


మార్కెట్ రీక్యాప్ :

నిఫ్టీ ఐదు నెలల నష్టాల పరంపరకు ముగింపు చెప్పగా, సెన్సెక్స్ మూడు నెలల క్షీణత నుంచి గట్టెక్కింది. అయినప్పటికీ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు శుక్రవారం(క్రితం సెషన్) నష్టాలతో ముగిశాయి. NSE నిఫ్టీ 50 72.60 పాయింట్లు లేదా 0.31% తగ్గి 23,519.35 వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 191.51 పాయింట్లు లేదా 0.25% తగ్గి 77,414.92 దగ్గర క్లోజైంది.


F&O సూచనలు :

నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.57% తగ్గి, 118 పాయింట్ల ప్రీమియంతో 23,637 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ కోసం ఓపెన్ ఇంట్రెస్ట్ 1.1% పెరిగింది. ఏప్రిల్ 3న గడువు ముగిసే నిఫ్టీ ఆప్షన్స్ కోసం, గరిష్ట కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,400 వద్ద ఉండగా, గరిష్ట పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,400 వద్ద ఉంది.


FII\DII :

ఆరు సెషన్ల తర్వాత శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు నికర విక్రేతలుగా మారారు. వాళ్లు రూ. 4,352.8 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా రెండవ రోజు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.7,646.5 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా చెబుతోంది.


వార్తలలో ప్రధాన స్టాక్‌లు :

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: టైర్-II బాండ్ల జారీ ద్వారా విజయవంతంగా రూ.770 కోట్లను సేకరించిందీ బ్యాంక్. ఇది ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంక్ చేసిన అతిపెద్ద బాండ్ జారీగా ఒక రికార్డు.

HAL: 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్ల సరఫరా కోసం రక్షణ మంత్రిత్వ శాఖ కంపెనీతో రూ.62,700 కోట్ల విలువైన రెండు ఒప్పందాలను ఖరారు చేసింది.

పవర్ మెక్ ప్రాజెక్ట్స్: కంపెనీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం అదానీ పవర్ అనుబంధ సంస్థ నుండి రూ.425 కోట్ల ఆర్డర్‌ను, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నిర్మాణ ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.972 కోట్ల ఆర్డర్‌ను పొందింది.


కరెన్సీ అప్‌డేట్ :

US డాలర్‌తో పోలిస్తే రూపాయి మూడు నెలల్లో అత్యధిక స్థాయిలో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపీ 33 పైసలు పెరిగి 85.46 వద్ద ముగిసింది.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 07:56 AM