Home » Cyber Crime
డిజిటల్ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపిన సైబర్ మాయగాళ్లు.. జనాన్ని భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. పోలీసు అధికారుల చిత్రాలను డిస్ప్లే పిక్చర్(డీపీ)గా పెట్టుకుని వాట్సాప్ కాల్స్ చేస్తూ జనాన్ని బురిడి కొట్టించాలని చూస్తున్నారు.
ఫుడ్ ఆర్డర్ చేసి, క్యాన్సిల్ చేసిన మహిళను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals), ఏపీకే లింక్‌ను పంపి రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన గృహిణి(38) జెప్టో యాప్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసింది.
తాను సీబీఐ అధికారినని, మీ బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయంటూ సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఓ ప్రభుత్వ ఉద్యోగిని బోల్తా కొట్టించారు. తాము చెప్పినట్లు వినకుంటే అరెస్ట్ తప్పదంటూ బెదిరించి రూ.48 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తానని.. యువకుడ్ని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) అతడి వద్ద నుంచి రూ.16.25 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు(City Cybercrime Police) ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరాల నిర్మూలనకు హ్యాక్ సమ్మిట్‌లో నిపుణుల సూచనలు, సలహాలు కీలకంగా మారుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీకి వారి అమూల్యమైన సూచనలు ఎంతో అవసరమని ఆయన చెప్పారు.
‘‘మేము ఈడీ అధికారులం. ఒక కేసులో మీ ప్రమేయం ఉంది. మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించాం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఫోన్ కట్ చేయకుండా వీడియో కాల్లో మా ఆధినంలో ఉండాలి’’ అంటూ ఫేక్ నోలీసులు పంపిస్తూ మోసగాళ్లు ‘డిజిటల అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి Lazardoo vip టాప్ అనే సైబర్ ముఠా భారీ లాభాల ఆశ చూపింది. తాము చెప్పిన చోట పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. రూ.100 పెడితే రూ.200లు వస్తాయని నమ్మ బలికారు.
మనీలాండరింగ్ కేసుల పేరుతో ఓ 74 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగినిని భయపెట్టి ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు పెన్షన్ డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆ రిటైర్డ్ ఉద్యోగినికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు.
డబ్బుల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే బెదిరించాడు. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే.. మీ పిల్లలను అనాథలను చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు! దీంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి ఆ నిందితుడిని గుర్తించారు.
ఎక్కువ లిమిట్‌తో కొత్త క్రెడిట్ కార్డు(Credit card) ఇస్తామని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు 68 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 2.19 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశారు.