Merath: ఆహారం వద్దు.. గంజాయి కావాలి!
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:44 AM
మేరఠ్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో అరెస్టయిన సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ జైలులో రచ్చరచ్చ చేస్తున్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన ముస్కాన్, సాహిల్.. తమకు ఆహారం వద్దని, మత్తు కావాలని జైలులో నానాయాగీ చేస్తున్నారు. జైలుకు వచ్చిన రోజు రాత్రి సాహిల్.. గంజాయి ఇవ్వండంటూ రచ్చరచ్చ చేశాడని పోలీసులు వెల్లడించారు.

జైలులో ముస్కాన్, ఆమె ప్రియుడి రచ్చ
న్యూఢిల్లీ, మార్చి 23: మేరఠ్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో అరెస్టయిన సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ జైలులో రచ్చరచ్చ చేస్తున్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన ముస్కాన్, సాహిల్.. తమకు ఆహారం వద్దని, మత్తు కావాలని జైలులో నానాయాగీ చేస్తున్నారు. జైలుకు వచ్చిన రోజు రాత్రి సాహిల్.. గంజాయి ఇవ్వండంటూ రచ్చరచ్చ చేశాడని పోలీసులు వెల్లడించారు. అలాగే, ముస్కాన్ కూడా మత్తు ఇంజక్షన్ల కోసం గొడవ చేసిందని తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వీరిద్దరికీ జైలు అధికారులు వైద్య సాయం అందిస్తున్నారు. ఇద్దరూ సాధారణ స్థితికి రావడానికి కనీసం 10 రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక, తనకు న్యాయవాదిని కేటాయించాలని ముస్కాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.