California: కొడుకు గొంతు కోసిన తల్లి అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:42 AM
11 ఏళ్ల వయస్సు ఉన్న తన కొడుకుని మాజీ భర్తకు అప్పగించడం ఇష్టం లేక ఆ బాలుడి గొంతు కోసి ప్రాణం తీసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 19న జరిగిన ఈ హత్యకు సంబంధించి సరిత(48) అనే మహిళ అరెస్టైంది. సరిత 2018 జనవరిలో తన భర్త ప్రకాశ్‌కు విడాకులు ఇచ్చింది.

న్యూయార్క్, మార్చి 23: అమెరికాలో ఓ భారత సంతతి మహిళ కన్నప్రేమను మరిచి అమానుషంగా ప్రవర్తించింది. విడాకులు తీసుకుని భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. 11 ఏళ్ల వయస్సు ఉన్న తన కొడుకుని మాజీ భర్తకు అప్పగించడం ఇష్టం లేక ఆ బాలుడి గొంతు కోసి ప్రాణం తీసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 19న జరిగిన ఈ హత్యకు సంబంధించి సరిత(48) అనే మహిళ అరెస్టైంది. సరిత 2018 జనవరిలో తన భర్త ప్రకాశ్‌కు విడాకులు ఇచ్చింది. అయితే, వారి కొడుకు యతిన్(11) బాధ్యతను కోర్టు ప్రకాశ్‌కు అప్పగించింది. ఐదు రోజుల పాటు యతిన్‌ను తన వద్ద ఉంచుకునేలా కోర్టు అనుమతి పొందిన సరిత మార్చి 14న తనతో తీసుకువెళ్లింది. మార్చి 19న తిరిగి ప్రకాశ్ దగ్గరకు పంపాల్సి ఉండగా.. అది ఇష్టం లేక యతిన్ గొంతుకోసింది.