Israel: 50 వేలు దాటిన పాలస్తీనా మృతుల సంఖ్య
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:45 AM
మృతుల్లో హమాస్ సీనియర్ రాజకీయ నేత సలా బర్దావిల్, ఆయన భార్య కూడా ఉన్నారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50 వేలకు చేరింది. హమాస్ బందీలుగా చేసుకున్న వారిని విడిచిపెట్టకపోతే దాడులు మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

టెల్ అవీవ్ మార్చి23: ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన తాజా వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హమాస్ సీనియర్ రాజకీయ నేత సలా బర్దావిల్, ఆయన భార్య కూడా ఉన్నారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50 వేలకు చేరింది. హమాస్ బందీలుగా చేసుకున్న వారిని విడిచిపెట్టకపోతే దాడులు మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తాజాగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు రఫా పట్టణంలోకి దూసుకుపోయాయి.
ఇవి కూడా చదవండి..