Kamaladevi Aravindan: రచయిత్రి కమలాదేవి అరవిందన్‌కు సింగపూర్ హాల్‌ఆఫ్ ఫేమ్ అవార్డు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:39 AM
కమలాదేవి (75) తమిళం, మలయాళంలో రచనలు చేస్తున్నారు. ఆమె సాహితీకృషిని సింగపూర్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ (ఎస్సీడబ్ల్యూ) గుర్తించి, ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కమలాదేవి నాటక రచయిత్రిగా విశేష ప్రతిభ కనబరిచారు.

చెన్నై, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన మహిళలకు అందించే హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఈ ఏడాది భారత సంతతి రచయిత్రి కమలాదేవి అరవిందన్‌ని వరించింది. కమలాదేవి (75) తమిళం, మలయాళంలో రచనలు చేస్తున్నారు. ఆమె సాహితీకృషిని సింగపూర్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ (ఎస్సీడబ్ల్యూ) గుర్తించి, ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కమలాదేవి నాటక రచయిత్రిగా విశేష ప్రతిభ కనబరిచారు. నేషనల్ లైబ్రరీ, సింగపూర్ తమిళ రచయితల సంఘం సంయుక్తంగా వర్ధమాన రచయితల కోసం నిర్వహించిన వర్క్‌షా్‌పలను ఆమె నడిపించారు. ఆమె నవల ‘సెంబవాంగ్’ సింగపూర్‌లో విడుదలైన అత్యుత్తమ రచనలలో ఒకటి. ఆమె రచనలు సింగపూర్, మలేసియా, కెనడా, భారత్‌లో విడుదలై, విశేష ఆదరణ పొందాయి. ఇప్పటిదాకా ఆమె 160కి పైగా కథానికలు, వ్యాసాలు, 18 రంగస్థల నాటకాలు, 300 రేడియో నాటకాలను రచించారు.