Share News

Justice Yashwant Varma: సగం కాలిన నోట్లను మేం చూశాం

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:52 AM

జడ్జి ఇంట్లో నోట్ట కట్టలే దొరకలేదని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ.. చెబుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలో వీధులను శుభ్రం చేసే పారిశుధ్య పనివారు మాత్రం నాలుగైదు రోజుల క్రితం జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసానికి సమీపంలో కాలిన రూ.500 నోట్లు తమకు కనిపించాయని చెప్పడం గమనార్హం.

 Justice Yashwant Varma: సగం కాలిన నోట్లను మేం చూశాం

పారిశుధ్య కార్మికుల వెల్లడి

స్టోర్‌ రూమ్‌లో నోట్ల కట్టలను తానుగానీ, తన కుటుంబసభ్యులుగానీ చూడలేదని జస్టిస్‌ యశ్వంత్‌వర్మ.. జడ్జి ఇంట్లో నోట్ట కట్టలే దొరకలేదని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ.. చెబుతున్నప్పటికీ, ఆ ప్రాంతంలో వీధులను శుభ్రం చేసే పారిశుధ్య పనివారు మాత్రం నాలుగైదు రోజుల క్రితం జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసానికి సమీపంలో కాలిన రూ.500 నోట్లు తమకు కనిపించాయని చెప్పడం గమనార్హం. ‘‘జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసం ఉన్న సర్కిల్‌లో మేం పనిచేస్తాం. వీధుల్లో చెత్తను సేకరిస్తాం. నాలుగైదు రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా.. (కాలిన) రూ.500 నోట్ల ముక్కలు కనిపించాయి. అయితే, అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగిందో మాకు తెలియదు’’ అని ఇందర్‌జీత్‌ అనే పారిశుధ్య కార్మికుడు ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపాడు. సురేందర్‌ అనే మరో పారిశుధ్య కార్మికుడు కూడా.. అక్కడ కాలిన రూ.500 నోట్లు దొరికినట్టు వెల్లడించాడు. .


‘‘ఇప్పటికి కూడా మాకు కొన్ని నోట్లు కనిపిస్తున్నాయి’’ అని అతడు పేర్కొనడం గమనార్హం. కాగా.. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని నియమించిన సుప్రీంకోర్టు కొన్నాళ్లపాటు జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు ఎలాంటి జ్యుడీషియల్‌ వర్క్‌ అప్పగించొద్దని ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఉపాధ్యాయకు సూచించింది


ఇవి కూడా చదవండి..

Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 02:52 AM