Secunderabad: ఆలయాలకు దసరా శోభ.. నేటి నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Oct 03 , 2024 | 10:56 AM
దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
సికింద్రాబాద్: దసరా వేడుకులకు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 3 (నేటి) నుంచి 12వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బల్కంపేట అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి(Secunderabad Ujjain Mahakali) అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపురసుందరీ దేవిగా, అమీర్‌పేట హనుమాన్ ఆలయంలో అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా, బల్కంపేట సైంటిఫిక్‌కాలనీ శ్రీవీరాంజనేయస్వామి శ్రీసాయి మణికంఠ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇదికూడా చదవండి: AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..
అమీర్‌పేట కనకదుర్గ ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా స్వర్ణకిరీటంతో అలంకృతురాలై దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కార్యనిర్వాహాణాధికారులు ఏర్పాట్లను చేశారు. ఈనెల 12న దసరా శరన్నవరాత్రోత్సవాలను అంగరరంగా వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్టు ఉజ్జయిని ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ఫౌండర్ ట్రస్టీ సురిటి కామేశ్వర్ తెలిపారు.
నల్లపోచమ్మ ఆలయంలో అన్నదానాలు
బోయిన్‌పల్లి: అమావాస్యను పురస్కరించుకుని న్యూబోయిన్‌పల్లి బాపూజీనగర్‌లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జంపన్న ప్రతాప్, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రకాష్ భాటియా ముఖ్యఅతిఽథులుగా హాజరై ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపన్న ప్రతాప్ మాట్లాడుతూ పితృపక్షాల రోజులైన మహాలయ అమావాస్య రోజున అన్నదానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామారావు, ప్రేమ్ ముదిరాజ్, అజిత్ కళ్యాణ్, నరసింహ, నరేందర్, మారుతీగౌడ్, జహంగీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
బౌద్ధనగర్: సీతాఫల్‌మండి డివిజన్ శ్రీనివా్‌సనగర్‌లోని శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ 47వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రాజేష్ కుమార్, ధర్మకర్తమండలి అధ్యక్ష, ఉపాధ్యక్షులు బసవరాజు శ్రీనివాస్, వేణుగోపాలరావు తెలిపారు. ఈనెల 8వ తేదీ మంగళవారం పద్మావతి గోదాసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 10న తిరుప్పావడ సేవ, 12న శ్రీవారి అవరాత్సోవం, కలశాభిషేకం, విజయదశమి పురస్కరించుకుని స్వరదర్శనం, శమీపూజలతోపాటు రోజూ పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహాకులు తెలిపారు.
లాల్‌బజార్ మహాకాళి ఆలయంలో అమావాస్య పూజలు
తిరుమలగిరి: లాల్‌బజార్‌లోని శ్రీమహాకాళి ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్‌కుమార్, ప్యారసాని భాగ్యశ్రీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో అన్నదానం జరుగుతుందని తెలిపారు. అన్నదానాని సహకరించిన దాతలకు అ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్యారసాని గౌరీశంకర్, వార్డ్-7 బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్, రుక్మయ్య, జిత్తుభాయ్, ఉమేష్, టీఎస్ ఎమార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వేణుగోపాల్, సురేష్, శ్రీను, హన్మంతు, చంద్రమౌళి, అనురాధారెడ్డి పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
ఇదికూడా చదవండి: Hyderabad: కేసీఆర్, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఇదికూడా చదవండి: KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?
ఇదికూడా చదవండి: Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్ బెనిఫిట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
Read Latest Telangana News and National News