Share News

Delhi High Court: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు జాప్యం.. ఆప్ సర్కారుపై హైకోర్టు అసహనం

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:48 PM

మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించేలా ప్రత్యేక సమావేశానికి ఆదేశించాలంటూ బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.

Delhi High Court: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు జాప్యం.. ఆప్ సర్కారుపై హైకోర్టు అసహనం

న్యూఢిల్లీ: మద్యం విధానం (Excise Policy Scam)పై 'కాగ్' (CAG) నివేదక వ్యవహారంలో సక్రమంగా వ్యవహరించలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) అసహనం వ్యక్తం చేసిది. అసెంబ్లీలో కాగ్ నివేదకపై చర్చించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని పేర్కొంది. ఇది పలు అనుమానాల తావిస్తోందని జస్టిస్ సచిన్ దత్తా సారథ్యంలోని ఏకసభ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Indian Army: ఎల్ఏసీ వద్ద పరిస్థితి సున్నితంగా ఉన్నా.. ఆర్మీ చీఫ్


మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించేలా ప్రత్యేక సమావేశానికి ఆదేశించాలంటూ బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ''నివేదిక విషయంలో మీ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మీరు నివేదకను స్పీకర్‌కు పంపి, అసెంబ్లీలో చర్చించి ఉండాల్సింది. టైమ్‌లైన్‌ను బట్టి చూస్తే ప్రత్యేక సెషన్ జరపకుండా మీరు జాప్యం చేస్తున్నారనే విషయం అవగతమవుతోంది" అని కోర్టు పేర్కొంది. దీనిపై.. ఎలక్షన్లు ముంచుకొస్తున్నందున ఎలా సెషన్ నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం తమ వాదనను కోర్టుకు వినిపించింది.


కాగా, ఫిబ్రవరిలో అసెంబ్లీ గడువు ముగుస్తున్నందున సిటీ అడ్మినిస్ట్రేషన్‌పై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఢిల్లీ అసెంబ్లీ సెక్రటేరియట్ గత విచారణలో కోర్టుకు తెలిపింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి 14 కాగ్ నివేదికలను సభ ముందుంచాలని బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై ఢిల్లీ ప్రభుత్వం, స్పీకర్, ఇందులో ప్రమేయం ఉన్న వారు స్పందించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇస్తూ, 14 నివేదకలను స్పీకర్‌ను పంపినట్టు తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది విజేంద్ర గుప్తా మాట్లాడుతూ, స్పీకర్‌ను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించాలని కోరారు. ఇందుకు కోర్టు నిరాకరిస్తూ, ఇరువైపులు వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తక్షణ ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 04:48 PM