Home » delhi liquor scam case
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత కూడా 'ఆప్' నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో అవినీతి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్ శనివారంనాడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేళ.. యూఎన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్.. ఎన్నికలు జరుగుతున్న ఏ దేశంలోనైనా.. ప్రజల రాజకీయ, పౌర హక్కులు సేఫ్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
MLC Kavitha: తీహార్ జైలు(Tihar Jail) అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆగ్రహం. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) పిటిషన్ దాఖలు చేశారు కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్(Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది.
Kavitha Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపరుచనున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ని మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి తీసుకోవడంతో అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని అధికారులు అంటున్నారు. ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఊహించని ఓ ట్విస్ట్ ఈడీ అధికారులకు ఎదురైంది.