Home » delhi liquor scam case
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం నమోదయ్యేలా కనిపిస్తోంది. సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయవద్దని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్‌ని తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ బలవంతపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..
Supreme Court Verdict On Kavitha Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరుగుతోంది. ఇదివరకే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు నుంచి కవిత లాయర్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఆమాద్మీ పార్టీ సైతం ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రేజీవాల్‌ను టార్గెట్ చేసి వేధిస్తోందని, దీనికోసం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మరోసార్లు సమన్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలచంలో విచారణకు రావాలని అధికారులు సమన్లలో పేర్కొన్నారు.