Share News

Delhi: కేజ్రీవాల్‌కి ఎదురుదెబ్బ.. అరెస్ట్ చేయవద్దంటు దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:12 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయవద్దని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్‌ని తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ బలవంతపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

Delhi: కేజ్రీవాల్‌కి ఎదురుదెబ్బ.. అరెస్ట్ చేయవద్దంటు దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయవద్దని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్‌ని తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ బలవంతపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేజ్రీని అరెస్ట్ చేస్తామా, చేయలేమా అనేది చెప్పలేమని.. విచారణకు ఆయన్ని సహకరించాలని ఈడీ కోరింది. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 22లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది.

ఈడీ సమన్ల వెనుక గల కారణాలను కేజ్రీవాల్‌కి చెప్పకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఉన్న ఆధారాలను తమకు చూపించాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కోర్టు తాజా తీర్పు కేజ్రీకి గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇటీవలే లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, కవితవంటి ఎంతో మంది నేతలు ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 05:41 PM