Share News

Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..

ABN , Publish Date - Mar 21 , 2024 | 09:17 PM

Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.

Arvind Kejriwal Arrest: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..
Kejriwal Arrest

Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు(Enforcement Directorate) ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్(AAP) కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అనేక దఫాలుగా నోటీసులు పంపినా స్పందించిన సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో సీఎం కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రేపు (శుక్రవారం) ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ నిలువరించారు భద్రతా సిబ్బంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 10:04 PM