Home » Devotees
హిందూ వేద క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 27 (ఆదివారం)న ఉదయం 5.23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 28(సోమవారం)న ఉదయం 7:50 గంటలకు ముగుస్తుంది.
మహా నంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభ వంగా నిర్వహించారు.
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్క రించుకొని లోక కళ్యాణార్ధం మల్లికార్జున స్వామి, భ్రమ రాంబ అమ్మవార్లకు సాయంత్రం వెండి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహిం చింది.
శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నంద్యాల: శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.
దసర ఉత్సవాల్లో భాగంగా అశ్వయిజ శుద్ద మహర్నవమి శుక్రవారం పట్టణంలో వెలసిన వాసవీ కన్యకా పరమేశ్వరి, చౌడేశ్వరి అమ్మవార్లు మహిషాసురమర్థని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలిసిన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం దుర్గాష్టమి సందర్బంగా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహానంది క్షేత్రంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామేశ్వరీదేవిని అర్చకులు స్కందమాత దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు.
దసరా ఉత్సవాల తొలిరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని 49వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు వెల్లడించారు. రెండో రోజు అమ్మవారిని 65వేల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు.