Dwarka Tirumala: అద్భుతం..శ్రీ వేంకటేశ్వర స్వామిని తాకిన సూర్యకిరణాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:17 PM
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది.

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాడు అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. మూల విరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏడాది చైత్రమాసంలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది.
వేంకటేశ్వర స్వామి విగ్రహం నుదిటిన ప్రారంభమై పాదాలను స్పృశించి ఉత్సవమూర్తులను తాకాయి. స్వామి విగ్రహాన్ని తాకిన సూర్యకిరణాలు అనంతరం రెండుగా చీలి పక్కనే ఉన్న అమ్మవారిని కూడా తాకాయి. కానీ ఈ ఏడాది కేవలం స్వామివారిని మాత్రమే సూర్యకిరణాలు తాకడం జరిగింది. ఆ అద్బుత దృశ్యాలను తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News