Share News

పరిశోధనలు ప్రామాణికంగా కొనసాగాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:17 PM

పరిశోధనలు ప్రామాణికంగా కొనసాగాలని పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు.

పరిశోధనలు ప్రామాణికంగా కొనసాగాలి
జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభిస్తున్న పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌

- పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌

- రాష్ట్రస్థాయి సెమినార్‌ ప్రారంభం

- ఘనంగా ఉగాది వేడుకలు

పాలమూరు యూనివర్సిటీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పరిశోధనలు ప్రామాణికంగా కొనసాగాలని పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పీయూలోని ఆడిటో రియంలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో రీసెర్చ్‌ మెథడాల జీ అండ్‌ ప్రాజెక్ట్‌ రూపకల్పనపై రెండు రోజుల రాష్ట్ర స్థా యి సెమినార్‌ ప్రారంభించారు. కార్యక్రమానికి వీసీ హాజరై మాట్లాడారు. పరిశోధనలు ఇప్పటి కాలంలో చాలా అవసర మని, గణాంక సాధనాలను ఉపయోగించడం చాలా కష్ట మని అన్నారు. పరిశోధన పద్ధతి, ప్రాజెక్టు పని మార్గ దర్శకత్వంపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిన్తున్న వ్యా పార నిర్వహణ విభాగానికి అభినందనలు తెలిపారు. కార్య క్రమంలో కన్వీనర్‌ ఎస్‌ఎన్‌ అర్జున్‌కుమార్‌, కో కన్వినర్‌ జావీద్‌ మొహమ్మద్‌ ఖాన్‌, డాక్టర్‌ నాగసుధ, కోఆర్డినేటర్‌ అరుంధతిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలి

కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం లైబ్రరీ ఆడిటోరి యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఆదిమానవుల నుంచి ఆధునిక మానవుడి జీవితానికి అన్ని వేళల ఆయువు పోస్తున్న ప్రకృతి ప్రసాధించిన షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పండుగని అన్నారు. అనంతరం విశిష్ట అతిథి గుం త లక్ష్మణ్‌ మాట్లాడుతూ సాంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి భవిష్యత్‌ తరాలకు అందించాలని, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మనం వచ్చిన మూలాలను మరిచిపోకూడదన్నారు. ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ మధుసూదన్‌ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రాజ్‌కుమార్‌, తెలుగు శాఖ అధికారి సంధ్యారాణి, చవ్వ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఉపకార వేతనానికి విద్యార్థి ఎంపిక

యూనివర్సిటీలోని మైక్రో బయాలజీ విభాగంలో డాక్టర్‌ శాంతిప్రియ అజ్మీర పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్న పరి శోధక విద్యార్థి ముడావత్‌ రవి జాతీయ ఉపకార వేత నానికి ఎంపికయ్యాడు. గురువారం యూజీసీ, కేంద్ర ప్రభు త్వం మినిస్ర్టీ ఆఫ్‌ ట్రైబల్‌ అఫైర్స్‌ ప్రతి సంవత్సరం మెరిట్‌ ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా పీయూ వీసీ శ్రీనివాస్‌, ఇంచార్జి రిజిస్ర్టార్‌ మధుసూదన్‌రెడ్డి అభినందించారు.

Updated Date - Mar 27 , 2025 | 11:17 PM