Share News

దివ్యాంగులకు మనోధైర్యాన్ని అందించాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:17 PM

దివ్యాంగులకు చేసే గొప్పసాయం మనోధైర్యాన్ని అందించడమే అని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాల ఆవరణలో దివ్యాంగులకు అలీంకో వారి ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దివ్యాంగులకు మనోధైర్యాన్ని అందించాలి
దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలక్రైం/కలెక్టరేట్‌ మార్చి27(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు చేసే గొప్పసాయం మనోధైర్యాన్ని అందించడమే అని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాల ఆవరణలో దివ్యాంగులకు అలీంకో వారి ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు తమ తరుపున ఇవ్వడానికి భవిత కే ంద్రాలు ఉంటాయని వీటిలో ప్రత్యేక శిక్షణ పొందిన అర్హతగలిన నిపుణులు బోధకులు ఉంటారన్నారు. వారి సేవలను ఉపయోగించుకొని నాణ్యమైన జీవన నైపుణ్యాలు అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రూ. 17.50లక్షల విలువగల ఉపకరణాలను ఆయన అందించారు. అనంతరం జిల్లా విద్యాధికారి యాదయ్య మాట్లాడుతూ దివ్యాంగులు లేని విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎంతో విలువైన ఉపకరణాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్‌ చౌదరి, యశోదర, శ్రీనివాస్‌, సత్యనారాయణ మూర్తి, ఎఎస్‌ఓ రాజుకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

మంచిర్యాల కలెక్టరేట్‌ : ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచా య తీరాజ్‌, గ్రామీణ అఽభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్‌ అన్నారు. గురువారం హైద్రాబాద్‌ నుంచి కలెక్టర్‌, అదికారులతో సమావేశం నిర్వహించారు. రైతు సంక్షేమంలో భాగంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. నాణ్య మైన గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే మహిళ సంఘాలకు పెట్రోలు బంకులు నిర్వహించేందుకు అవకాశం కల్పించి ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ రబీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహ నలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలకు కేంద్రాలను కేటాయించేలా కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదను కలెక్టర్‌ మోతిలాల్‌, డీఆర్‌డీవో కిషన్‌, బ్రహ్మరావు, శ్రీకళ, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:17 PM