Share News

అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:21 PM

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పక డ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ సూచించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా చేపట్టాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అధికారులు

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌

ఆసిఫాబాద్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పక డ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ సూచించారు. గురువారం హైదరాబా ద్‌ నుంచి సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు జిల్లా గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగో లు, యూనిక్‌ డిసెబులిటి ఐడీ గుర్తింపు కార్డుల జారీ, దివ్యాంగులకు సదరం శిబిరాల నిర్వహణ, పరికరాలు సమకూర్చడం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో అర్హులైన కుటుంబాలను గుర్తించడం, మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంకుల నిర్వహణ, స్వయం సహయక సంఘాలకు విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీకి కేటాయింపు, జిల్లా కేంద్రంలో మహిశాశక్తి భవన నిర్మాణం, తదిత అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ధాన్యం కొనుగోలు కొరకు ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రైతులకు లబ్ధిచేకూరే విధంగా చర్యలు తీసుకో వా లన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేపట్టిన యూనిక్‌ డిసెబులిటి ఐడీ గుర్తింపు కార్డులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ భవన సముదాయంలో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకే పీ ఆద్వర్యంలో మహిళా సంఘాలకు కేటాయించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు యూనిక్‌ డిసెబులిటీ ఐడీ కార్డులను జారీ చేసేందుకు సదరం క్యాంపుల నిర్వహణ, పరికరాలు సమకూర్చడం కొరకు భవనాన్ని గుర్తించామన్నారు. సమావశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి దత్తారావు, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:21 PM