Share News

34 రోజులైనా..

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:16 PM

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటన జరి గి గురువారానికి 34 రోజులు అవుతున్నా.. శిథిలాల కిం ద చిక్కుకున్న మరో ఆరుగురి ఆచూకీ లభించలేదు.

34 రోజులైనా..
రెస్క్యూ బృందాలతో సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారి శివశంకర్‌

- క్యాడవర్‌ డాగ్స్‌కు చిక్కని మరో ఆరుగురి ఆచూకీ

- ఎస్‌ఎల్‌బీసీలో శిథిలాల కింద కూరుకుపోయిన లోకో ట్రైన్‌ వెలికితీత

- మనోజ్‌కుమార్‌ కుటుంబానికి పరిహారం చెక్కు అందించిన అధికారులు

దోమలపెంట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటన జరి గి గురువారానికి 34 రోజులు అవుతున్నా.. శిథిలాల కిం ద చిక్కుకున్న మరో ఆరుగురి ఆచూకీ లభించలేదు. ఫి బ్రవరి 22 నుంచి సహాయ బృందాలు నిర్విరామంగా శ్ర మిస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చి క్కుకోగా టీబీఎం మిషన్‌ ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌ మృ తదేహాన్ని మార్చి 9న బయటకు తీశారు. ఈ నెల 25న ప్రాజెక్టు ఇంజనీర్‌ మనోజ్‌కుమార్‌ మృతదేహాన్ని వెలికీ తీశారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఆరుగురు కో సం అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానంతో రెస్క్యూ బృం దాలు పనిచేస్తున్న కనుగొనలేకపోయారు. గురువారం మరోమారు క్యాడవర్‌ డాగ్స్‌ సొరంగంలోకి వెళ్లాయి. మ నోజ్‌కుమార్‌ మృతదేహం దొరికిన చోటనే డాగ్స్‌ వాసన గుర్తించగా అక్కడ పూర్తిగా అడగు వరకు శిథిలాలను తొలగించారు. సహాయక చర్యల్లో పాల్గొనే రెస్క్యూ బృం దాలకు ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు.

ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో సమీక్ష

సొరంగంలో చిక్కున్న వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక చర్యల పనితీరుపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి శివశంకర్‌ లోతేటి అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కార్యాలయంలో వివిధ శాఖల అధికారుల తో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలో పాల్గొనే రె స్క్యూ బృందాల అధికారులతో చర్చించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం 11 ఏజెన్సీలకు చెందిన వారు మూడు షిఫ్టుల్లో 600 మంది సిబ్బంది స హాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. సొరంగం లో వెలువడుతున్న శిథిలాలను ఎప్పటికప్పుడు లోకో ట్రై న్‌తో బయటకు తరలిస్తున్నట్లు చెప్పారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేపడుతున్నందుకే పురోగతి వస్తుందన్నారు. సమీక్షలో ఆర్మీ అధికారి వికాస్‌ సింగ్‌, మేజర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, సింగరేణి మైన్స్‌ రె స్క్యూ జనరల్‌ మేనేజర్‌ భైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివా సులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కిరణ్‌ కుమార్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి గిరిధర్‌రెడ్డి, దక్షిణ మ ధ్య రైల్వే అధికారి చంద్ర, హైడ్రా, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ జేపీ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

పరిహారం చెక్కు అందజేత

ఇంజనీర్‌ మనోజ్‌ కుమార్‌ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బంగర్‌మావు గ్రామంలో కుటుంబ సభ్యులకు అ ప్పగించారు. ప్రభుత్వపరంగా రూ.25 లక్షల చెక్కును రెవెన్యూ అధికారులు భార్యకు అందించారు.

లోకో ట్రైన్‌ వెలికి తీత

శిథిలాల కింద మునిగిపోయిన లోకో ట్రైన్‌ పూర్తిగా వెలికీతీశారు. ట్రైన్‌ చుట్టూ మట్టి, బుర ద, ఇనుప పైపులు, గడ్డర్లను తొలగించారు. ట్రైన్‌ అడుగు భాగంలో ఏమైనా మృతదేహాలు చిక్కు కున్నాయన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు అక్కడ యంత్రాలతో కాకుండా మనుషులు తవ్వ కాలు చేపట్టారు. మృతదేహాలు ఉన్నట్లయితే లో కో ట్రైన్‌నూ ప్లాస్మా కటింగ్‌ చేసి బయటకు తీ యాలనుకున్నారు. ఎటువంటి ఆనవాళ్లు దొరక కపోవడంతో శుక్రవారం యంత్రాలను ఉపమోగిం చి చిక్కుకున్న ప్రాంతం నుంచి బయటకు లాగివే సేందుకు రెస్క్యూ అధికారులు ప్రయత్నిస్తున్నా రు. ఇంకా 185 మీటర్ల వరకు శిథిలాలను తొల గించాల్సి ఉంది.

Updated Date - Mar 27 , 2025 | 11:16 PM