Share News

మక్తల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి ఏదీ.?

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:17 PM

మక్తల్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.350 కోట్లు తెచ్చామని చెబుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎక్కడ ఖర్చు చేశారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

మక్తల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి ఏదీ.?
మాగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మాగనూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.350 కోట్లు తెచ్చామని చెబుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎక్కడ ఖర్చు చేశారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం మాగనూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా మక్తల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసింది ఏమీ లేకపోగా వచ్చి అబద్దాలు చెబుతున్నారని సంపాదనపైన ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై మండిపడ్డారు. సంగంబండ రిజర్వాయర్‌ కింద వేసుకున్న రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. సమావేశంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, బసంత్‌రెడ్డి, పల్లె మారెప్ప, మహమ్మద్‌ సుల్తాన్‌, అడిగొప్ప, వాకిటి రాజు, పూలరాము, గజపతి, బీఆర్‌ఎస్‌ నాయ కులు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:17 PM