Share News

Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:10 PM

మనం ఒకటిగా నిలబడినప్పుడు, చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పులుగా ఏర్పడతాయి. ఈ మార్పులు మనకు మాత్రమే కాదు, భవిష్యత్తు తరం కోసం కూడా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు ఎర్త్ అవర్ సందర్భంగా ప్రకృతి రక్షణ కోసం మనం ఒక గంట పాట విద్యుత్ లైట్లను ఆపేయాలని నిపుణులు సూచించారు.

Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..
Earth Hour 2025

ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మంచి జీవనశైలిని పొందాలని ఆశిస్తారు. దాని కోసం పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకు కావలసిన మార్పులను తీసుకురావడంలో ఎర్త్ అవర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో దీనిని ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అంటే ఇదే రోజు కోట్లాది మంది ప్రజలు ఓ గంటపాటు విద్యుత్ లైట్లను ఆపివేసి వాతావరణ మార్పులకు సహకరిస్తారు. ఇలా ఒక్క గంట పాటు అన్ని లైట్లను ఆపేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి ఎంతో తోడ్పాటునిచ్చినట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఈ ఉద్యమం ఎలా ప్రారంభమైంది

2007లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) ఈ అనుబంధ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని ప్రపంచంలోని ప్రజలకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించారు. ఎర్త్ అవర్ ప్రారంభించిన తర్వాత, ఈ ఉద్యమం ప్రతి సంవత్సరం మార్చి 22న నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు లైట్లు ఆపేసి వాతావరణ మార్పులకు సహకరిస్తున్నారు.

ఈ సంవత్సరం థీమ్

2025లో ఎర్త్ అవర్ ప్రధానంగా “ప్రకృతి శక్తి” అనే థీమ్‌తో జరగనుంది. ప్రకృతి శక్తి అనేది వాతావరణ మార్పులను ఎదుర్కొవడంలో ప్రకృతికి సంబంధించిన విధానాలను ఎలాగైనా మనం అలవర్చుకోవాలని సూచిస్తుంది. ఈ సంవత్సరం ఎర్త్ అవర్ యునైటెడ్ నేషన్స్ ప్రపంచ జల దినోత్సవంతో ఒకే రోజున జరుగుతుంది. ఇది మన సహజ వనరులను, ముఖ్యంగా నీటిని రక్షించడంపై మరింత ఫోకస్ చేయాలని గుర్తు చేస్తుంది.


వాతావరణ మార్పులపై అవగాహన పెంచడం

ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ ఈ సమయాన్ని వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి, శక్తి వినియోగం తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్‌పై పోరాటం వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తుంది. దీంతో పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి వారి బాధ్యతను గుర్తు చేస్తుంది. ఎర్త్ అవర్ ఒక చిన్న శక్తివంతమైన చర్య. లైట్లు ఆపటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉన్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఒక అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ఇది మనందరి జీవనశైలిలో మార్పు తీసుకురావడానికి ఒక మంచి సంకేతమని నిపుణులు అంటున్నారు.


ఇంధన పరిరక్షణ ప్రోత్సహించడం

ఒక గంట పాటు కృత్రిమ లైట్లు ఆపడం అనేది తక్కువ శక్తి వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. ఇది ప్రజలను శక్తి వినియోగంపై ఆలోచించేలా చేస్తుంది. అలాగే అటు ఇంట్లోని పరికరాలు ఆపడం లేదా పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం వంటి అవకాశాల గురించి ఆలోచించే ఛాన్సుంది.

ఎర్త్ అవర్ 2025లో మీరు కూడా పాల్గొనండి..

ఈ ప్రపంచ ఉద్యమంలో మీరు కూడా రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు ఆపివేసి పాల్గొనండి. మీరు ఎక్కడ ఉన్నా, చుట్టూ ఉన్న అనవసరమైన కృత్రిమ లైట్లను ఆపి, ఒక గంట పాటు మనం పర్యావరణ పరిరక్షణకు సహకరించవచ్చు.


ఇవి కూడా చదవండి:

WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 22 , 2025 | 06:13 PM