Share News

Kunal Kamra row: డిప్యూటీ సీఎంపై కమెడియన్ సెటైర్లు.. అధికార పార్టీ నేత అరెస్ట్‌..

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:41 PM

Kunal Kamra row: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో సందర్భంగా డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. అతడు షో జరిగిన హోటళ్లో అధికార పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి నేతృత్వం వహించిన అధికార పార్టీ నేత రాహుల్ కునాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Kunal Kamra row: డిప్యూటీ సీఎంపై కమెడియన్ సెటైర్లు.. అధికార పార్టీ నేత అరెస్ట్‌..
Kunal Kamra

Kunal Kamra row: ఒక షో సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సదరు వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ కునాల్ కా కమాల్ అనే ట్యాగ్‌తో ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దీంతో అధికార, విపక్షాల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది. హాస్యం పేరుతో తమ నేతను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డ శివసేన నేతలు సోమవారం నాడు కునాల్ షో చేసిన హోటల్‌పై దాడి చేశారు.


స్టూడియోపై దాడి.. 40 మందిపై కేసు..

సీఎం ఫడ్నవీస్ కూడా కునాల్ వ్యాఖ్యలు ఖండించడంతో వివాదం మరింత ముదిరింది. అనంతరం ముంబైలోని కునాల్ ఆఫీసుపై దాడులు,ఎఫ్ఐఆర్‌లు, అరెస్ట్ డిమాండ్‌లతో శివసేన కార్యకర్తలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో హోటల్ కాంటినెంటల్ స్టూడియో వెలుపల వీరంగం సృష్టించారు. దీంతో హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఈ దాడికి నేతృత్వం వహించిన శివసేన నేత రాహుల్ కనాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 40 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.


డిప్యూటి సీఎం దేశద్రోహి : కమెడియన్

డిప్యూటీ సీఎం ఒక "దేశద్రోహి", "ఉద్ధవ్ ఠాక్రేను మోసం చేసిన బ్యాక్‌స్టాబర్" అంటూ హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో జరిగిన షోలో విరుచుపడ్డారు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (comic Kunal Kamra). శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి బీజేపీతో జట్టు కట్టాయని, ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయని విరుచుకుపడ్డారు. షిండేను టార్గెట్ చేసి మాట్లాడటంతో ఆయన ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చి హాబిటాట్ స్టూడియో ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. ఉద్ధవ్ నుంచి డబ్బులు తీసుకుని తమ నేతను అవమానిస్తున్నారని షిండే ఫ్యాన్స్ మండిపడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం కునాల్ చెప్పిందే నిజమే కదా.. షిండే ఫ్యాన్స్ అతిగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారనని సపోర్ట్ చేస్తున్నాయి.


Read Also : Uddhav Thackeray: ద్రోహి అనడం తప్పు కాదు... కునాల్‌ను సమర్ధించిన ఉద్థవ్ థాకరే

Devendra Fadnavis: క్షమాపణ చెప్పాలి.. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఆగ్రహం

Viral Video: అనుకోని సంఘటన.. ఈమె చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..

Updated Date - Mar 24 , 2025 | 03:45 PM