Kunal Kamra: ఈ సారి ఎంపీ సుధామూర్తిని టార్గెట్ చేసిన కమెడియన్ కునాల్..
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:52 PM
Kunal Kamra: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గట్లేదు. ఈ సారి ఎంపీ సుధామూర్తి 'సింపుల్' లైఫ్‌స్టైల్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Kunal Kamra: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)తో మొదలుపెట్టి వరసగా ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా. షిండే వివాదంలో పోలీసు కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తిని టార్గెట్ సహా పలువురు సెలబ్రిటీలను ‘నయా భారత్’ షోలో టార్గెట్ చేశాడు. ముఖ్యంగా ఎంపీ సుధామూర్తి (Sudha Murthy) సింప్లిసిటీని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కునాల్ కమ్రా ఇటీవల "నయా భారత్" షోలో రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తిని, ఆమె భర్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తితో సహా అనేక మంది ప్రముఖులను ఆయన విమర్శించారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ షోలో దేశంలోని ధనవంతులైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ, సుధా మూర్తి "సింప్లిసిటీ"ని, నారాయణ మూర్తి వారానికి 70 గంటలను తీవ్రంగా విమర్శించారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కూడా విమర్శించాడు.
సుధామూర్తి సింప్లిసిటీపై సెటైరికల్ స్టోరీ..
"ధనవంతులైనా మధ్యతరగతికి చెందినవారిగా నటించేవారిలో సుధామూర్తి అనే గొప్ప మహిళ ఉంది. సింప్లిసిటీకి తాను ప్రతిరూపం అన్నది ఆమె వాదన. ఈ అంశంపై ఆమె 50 పుస్తకాలు రాశారు. ఏ ఎయిర్‌పోర్టుకు వెళ్లినా సింప్లిసిటీపై ఆమె రాసిన పుస్తకాలు మీకు కనిపిస్తాయి" అని కునాల్ అన్నారు. ఆ తర్వాత సుధామూర్తి ఉద్దేశిస్తూ ఒక కల్పిత కథ చెప్పారు. "ఒకసారి నేను (సుధా మూర్తి) ఒక మామిడికాయలు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్ళాను. అతడు నాకు రూ.100కి ఎనిమిది మామిడికాయలు ఇచ్చాడు. అప్పుడే కార్పొరేట్ దుస్తులు ధరించిన ఒక మహిళ అక్కడకు వచ్చింది. కానీ పండ్లు అమ్మే వ్యక్తి ఆమెకు రూ.150 కి ఎనిమిది మామిడికాయలు ఇచ్చాడు. నేను అతడిని మీరు నాకు తక్కువ ధరకు ఇచ్చి, ఆమె దగ్గర ఎందుకు ఎక్కువ తీసుకున్నారని అడిగాను. ఆ మహిళ ఇన్ఫోసిస్ అనే అంతర్జాతీయ కంపెనీలో పెద్ద జాబ్ చేస్తోందని అతడు నాకు జవాబిచ్చాడు" అని సుధామూర్తిలా మిమిక్రీ చేస్తూ చెప్పాడు.
70 పనిగంటల వెనక సీక్రెట్ అర్థమయ్యిందా : కునాల్
నారాయణ మూర్తి వారానికి 70 గంటలు ఎందుకు పని చేయాలనుకుంటున్నారో ఇప్పుడు అర్థమైందా? సుధా మూర్తి 'మై సింపుల్ హు' (నేను సింపుల్‌ని) అని అతని మెదడును వేయించుకు తినేది. అందుకే నారాయణ మూర్తి 'మై ఘర్ కే బహార్ హు' (నేను ఇంటి బయట ఉన్నాను) అని అంటాడు. ఇదిలా ఉంటే.. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఉన్న రెండేళ్లు ఈమె టోటల్ UK కే అత్తగారు. ఇప్పుడు ఎంపీగా రాజ్యసభకు సింపుల్‌గా వెళుతున్నారు. ఇదేం నిరాడంబరత" అని సైటైర్లు వేశాడు కునాల్ కమ్రా.
ఆనంద్ మహీంద్రాను వదల్లేదు..
ఈ షో సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాపైనా విరుచుకుపడ్డాడు కునాల్ కమ్రా. సొంత కార్లను మెరుగుపర్చుకునే విషయంలో తప్ప ఇతర అన్ని విషయాల్లో శ్రద్ధ పెడుతుంటారని సెటైర్లు వేశారు. ముంబయి వరదల సమయంలో డబుల్ డెక్కర్ బస్సుపై పిల్లలు ఆడుకునే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారని వ్యంగ్యంగా అన్నారు.
Read Also : Rahul Gandhi: అమెరికాలో పర్యటించనున్న రాహుల్
Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం
Earthquake In India: భారత్‌లోనూ భూప్రకంపనలు.. భయంతో జనాల పరుగులు