Home » Election Campaign
ఎన్నికల్లో వైసీపీ పని అయిపోయిందని, మరో వారంలో ప్యాకప్ తప్పదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు జయరాం సమక్షంలో టీడీపీలో చేరారు.
టీడీపీ అధికారంలోకి రాగానే ఉంతకల్లు రిజర్వాయర్‌ను పదేళ్లలో నిర్మించి రైతులకు రెండు పంటలకు నీరందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. బుధవారం బొమ్మనహాళ్ మండలంలోని హొసళ్లి, వన్నళ్లి, దర్గాహోన్నూరు, గోవిందవాడ, సింగానహళ్లి, గోనేహాళ్, కణేకల్లు మండలంలోని బెణెకల్లు, ఉడేగోళం, మారెంపల్లి గ్రామాల్లో కాలవ రోడ్‌షో నిర్వహించారు.
చేతకాని మాటలు మాట్లాడేవాడే డేరాబాబా అని వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడుపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నిప్పులు చెరిగారు. మండలంలోని ఎస్ కోనాపురం గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ముప్పులకుంట, పిల్లలపల్లి, సూగేపల్లి, కోనాపురం, సంతే కొండాపురం, ఎర్రకొండాపురం, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో అమిలినేని ప్రచారం చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని ఎస్సీ హాస్టల్ సమీపంలో బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకురాలు సరస్వతమ్మ అధ్యక్షత వహించారు. కేశవ్ మాట్లాడుతూ మన తలరాతలను మనమే రాసుకునే రోజు మీ చేతుల్లోనే ఉందన్నారు.
Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. వేములవాడ , వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నిక లు నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుం ట అంజినప్ప.. జి ల్లా ఎన్నికల పోలీ సు పరిశీలకుడు ఇమ్నాలెన్సాను కోరా రు.
లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో రెండు మూడు రోజులుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతంగా సిద్ధం స్టిక్కర్లు అతికిస్తు న్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చీఫ్ ఎలెక్షన ఏజెంట్ జేఈ అనిల్‌కుమార్ మంగళవారం పోస్టల్‌బ్యాలెట్ పోలింగ్ కేంద్రంవద్ద హిందూపురం ఎన్నికల రిటర్నిం గ్ అధికారి, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌ను కలిశారు.
స్థానిక కొట్నూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఉందని తెలిసినా పది గంటల వరకు పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మరోపక్క ఉద్యోగులు తమ ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. వచ్చిన వారికి కనీసం పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీని వలన మహిళా ఓటర్లు సుమారు మూడు గంటల పాటు చెట్ల నీడనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.