Home » Election Commission
జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఎస్పీ అమిత బర్దర్‌ను ఎన్నికల కమిషన సస్పెండ్ చేయడంతో ఆయన స్థానంలో కొత్త ఎస్పీని నియమించారు. విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలి ఆదివారం బాధ్యతలు తీసుకుంటారని తెలిసింది. ఆమె స్వస్థలం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నెలి. ఎస్వీ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేశారు. 2014లో యూపీఎస్పీ పరీక్షల్లో 783 ర్యాంకు సాధించారు. కడప...
తిరుపతి,తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) తెలిపారు. మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ ఉంటాయి.. కానీ, ఎన్నికల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చేసే ఖర్చుపై పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎన్నికల ప్రక్రియలో అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీగానీ, అడిటింగ్ కానీ ఉండదు. అందుకే, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని తాజాగా వెల్లడైంది.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.