Home » Election Commission
ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంతవరకూ రెండు విడతల పోలింగ్ పూర్తికాగా, ఈ రెండు విడతల్లో పోలింగ్ శాతాన్ని అధికారికంగా భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడతలో 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం నమోదైనట్టు వెల్లడించింది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గాజు గ్లాస్ గుర్తును వేరే వారికి కేటాయించడంపై జనసేన పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సమస్యను 24 గంటల్లో పరిష్కరిస్తామని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ న్యాయవాది హామీ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ సోమవారం విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచిం చారు. ఆయన సోమ వారం హిందూ పు రం వద్ద ఈవీఎం స్ర్టాంగ్ రూమ్ పో లింగ్, కౌంటింగ్ కేంద్రాలను డీఎస్పీ కంజక్షన, సీఐలతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈవీఎం స్ర్టాంగ్రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతోపాటు పోలీసులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలన్నా రు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికిపో తారని హెచ్చరిం చారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 'ఆమ్ ఆద్మీ పార్టీ' రూపొందించిన పాటను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఆప్ తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) అన్నారు. మొదటిసారిగా ఓటు వేస్తున్న యువతతో గుంటూరులో శనివారం ఉదయం లెట్స్ ఓట్ 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) ముందు పెన్షన్ పంపిణీపై ఎంత హైడ్రామా నడుస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదేశాలు పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్.. కుదరదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో అసలు పెన్షన్ల కథేంటో తెలియని పరిస్థితి.! అయితే తాజాగా పెన్షన్ల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
సామాజిక పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తేల్చేశారు.
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరి లోక్సభ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయనున్నారనే ఊహాగానాల మధ్య ఎన్నికల కమిషన్ కు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబాబూ ముఫ్తీ లేఖ రాశారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దని ఈసీకి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.