AP Elections: ఏపీ పోలీస్ బాస్‌గా శంఖబ్రత, బాధ్యతలు స్వీకరించిన కొత్త బాస్
ABN , Publish Date - May 06 , 2024 | 12:03 PM
ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. అధికార వైసీపీకి అనుకూలంగా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో వెంటనే ఆయన్ను పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. కొత్త డీజీపీ నియమించే వరకు శంఖబ్రత బాగ్జీ ఇంచార్జీ డీజీపీగా విధులు నిర్వహిస్తారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. అధికార వైసీపీకి అనుకూలంగా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో వెంటనే ఆయన్ను పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. డీజీపీ పదవి కోసం అధికారుల పేర్లను పంపించాలని కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్త అనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను పంపించినట్టు తెలిసింది. కొత్త డీజీపీ ఎవరనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి సోమవారం నాడు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంచార్జీ డీజీపీగా శంఖ్రత బాగ్చీ పదవిలో ఉంటారు. శంఖబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు.
Read Latest Andhra pradesh News or Telugu News