AP Elections: ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్
ABN , Publish Date - May 08 , 2024 | 07:04 AM
నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాల ఎస్పీ లకు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా ఉంటున్నారని సీరియస్ అయ్యింది. నిష్పక్షపాతంగా ఉండకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. సంఘటన జరిగిన తరువాత కూడా సరిగా స్పందించడం లేదని ఈసీ పేర్కొంది. రాయలసీమలోని రెండు జిల్లాలు, ఉత్తరాంధ్ర , కోస్తా, గోదావరి జిల్లాలోని ఒక్కో ఎస్పీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొందరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పక్షపాతంగా వ్యవహరిస్తుండంటంతో వారికి ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాల ఎస్పీ లకు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా ఉంటున్నారని సీరియస్ అయ్యింది. నిష్పక్షపాతంగా ఉండకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. సంఘటన జరిగిన తరువాత కూడా సరిగా స్పందించడం లేదని ఈసీ పేర్కొంది. రాయలసీమలోని రెండు జిల్లాలు, ఉత్తరాంధ్ర , కోస్తా, గోదావరి జిల్లాలోని ఒక్కో ఎస్పీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఆయా జిల్లాల్లో జరిగిన సంఘటనలను పేర్కొని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది.
ఇవి కూడా చదవండి..
CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు
Read more Telangana News and Telugu News